KTR: ఇంగ్లాండ్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్, కేటీఆర్

షార్ట్స్‌లో చూడండి
సొంతగడ్డపై జరిగిన వరల్డ్ కప్ ను అత్యంత ఉత్కంఠభరిత పరిస్థితుల మధ్య నెగ్గిన ఇంగ్లాండ్ జట్టుకు టీడీపీ యువనేత నారా లోకేశ్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బెన్ స్టోక్స్ నిజంగా నువ్వు హీరో, క్రికెట్ చరిత్రలో ఇలాంటి మ్యాచ్ ఎప్పుడూ చూడలేదు. ఈ విజయానికి ఇంగ్లాండ్ అన్నివిధాలా అర్హత ఉన్న జట్టు. టైటిల్ గెలిచే క్రమంలో ఇంగ్లాండ్ చూపిన తెగువ అమోఘం అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. ఇక కేటీఆర్ సైతం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇలాంటి అద్భుతమైన రాత్రి మరొకటి లేదంటూ కితాబిచ్చారు. ఇంగ్లాండ్ మీ అదృష్టం మీ 12వ ఆటగాడిలాగా పొంగిపొర్లుతోందంటూ ట్వీట్ చేశారు. ఇక కివీస్ జట్టును చూస్తుంటే గుండె నీరయిపోతోందంటూ సానుభూతి వ్యక్తం చేశారు.
Go Back to Shorts
KTR
Nara Lokesh
World Cup
England

More Telugu News