T-Congress: కుంతియా ఉన్నంత కాలం టీ-కాంగ్రెస్ బాగుపడదు: వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

  • విమర్శించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
  • చర్యలు తీసుకోకపోతే అధిష్ఠానాన్నీ విమర్శిస్తారు
  • విమర్శలు చేసినోళ్లే మళ్లీ ‘కాంగ్రెస్’లో కొనసాగుతారట!
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియాపై సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ-కాంగ్రెస్ లో కుంతియా ఉన్నంతకాలం పార్టీ బాగుపడదని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు, ఇన్ ఛార్జిని విమర్శించిన వారిపై ఇంతవరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని ప్రశ్నించారు. విమర్శలకు పాల్పడ్డ వాళ్లే ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాననడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. విమర్శలు చేసిన వారిపై చర్యలు తీసుకోకపోతే కనుక ఎవరు పడితే వారు అధిష్ఠానాన్ని సైతం విమర్శిస్తారని అభిప్రాయపడ్డారు.
T-Congress
pcc
Uttam Kumar Reddy
VH

More Telugu News