New Zealand: కీలకమైన విలియమ్సన్ వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

  • లార్డ్స్ లో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్
  • స్కోరు 23 ఓవర్లలో 2 వికెట్లకు 103 పరుగులు
లార్డ్స్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు ప్రధానమైన వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరును 100 పరుగుల మైలురాయి దాటించిన అనంతరం కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇంగ్లాండ్ బౌలర్ ప్లంకెట్ కు బలయ్యాడు. విలియమ్సన్ 30 పరుగులు చేసి అవుటయ్యాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు 23 ఓవర్లలో 2 వికెట్ నష్టానికి 103 పరుగులు. నికోల్స్ 46, రాస్ టేలర్ 0 పరుగులతో ఆడుతున్నారు.
New Zealand
England

More Telugu News