Ramnath Kovind: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో సింఘాల్ లను ప్రత్యేకంగా పిలిపించుకుని అభినందించిన రాష్ట్రపతి

  • రాష్ట్రపతి తిరుమల పర్యటన
  • ఈ ఉదయం స్వామివారిని సేవించుకున్న రామ్ నాథ్ కోవింద్
  • రాష్ట్రపతికి వేదిక్ యూనివర్శిటీ గురించి చెప్పిన వైవీ, సింఘాల్
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరుమల విచ్చేసిన సంగతి తెలిసిందే. శనివారం సాయంత్రం తిరుమల వచ్చిన ఆయన ఈ ఉదయం స్వామివారి దర్శనం చేసుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయన అంతకుముందు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కూడా సందర్శించారు. ఇక తిరుమలలో ఏర్పాట్లు, భక్తుల పట్ల టీటీడీ వైఖరి ఆయన్ను ముగ్ధుడ్ని చేశాయి. అందుకే, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను ప్రత్యేకంగా పిలిపించుకుని వారిద్దరినీ అభినందించారు.

భక్తులకు అసౌకర్యం కలగకుండా టీటీడీ చేస్తున్న ఏర్పాట్లను రాష్ట్రపతి కోవింద్ ప్రశంసించారు. ఈ సందర్భంగా తిరుమలలో భక్తులకు కల్పిస్తున్న సదుపాయాల వివరాలను వైవీ, సింఘాల్ రాష్ట్రపతితో పంచుకున్నారు. అంతేగాకుండా, వేదిక్ యూనివర్శిటీ ప్రత్యేకతలను కూడా వివరించారు. తిరుమల పర్యటన ముగించుకున్న రాష్ట్రపతి రేణిగుంట పయనమయ్యారు. అక్కడినుంచి చంద్రయాన్ -2 ప్రయోగాన్ని వీక్షించేందుకు ఆయన శ్రీహరికోట వెళతారు.
Ramnath Kovind
President Of India
Tirumala
TTD

More Telugu News