బీజేపీ ఎంపీ హేమమాలిని బాగా ఊడుస్తారంటూ నెటిజన్ల సెటైర్లు!

షార్ట్స్‌లో చూడండి
బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి హేమమాలినిపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నిన్న పార్లమెంట్ ప్రాంగణంలో ‘స్వచ్ఛభారత్’ నిర్వహించారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తో పాటు పలువురు ఎంపీలూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హేమమాలిని కూడా వారితో పాటు చీపురు పట్టి పార్లమెంట్ ప్రాంగణాన్ని శుభ్రం చేశానని అనిపించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాలకు చేరింది. హేమమాలిని ఎంతో వయ్యారంగా ఊడుస్తుండటంపై నెటిజన్లు వ్యాఖ్యలు చేశారు. ‘కాస్ట్ లీ రోడ్ హర్ట్ కాకుండా’ ఆమె బాగా ఊడుస్తారని ఓ నెటిజన్ వ్యంగ్యాస్త్రాలు సంధించడం గమనార్హం.
Go Back to Shorts
Bollywood
Bjp
mp
Hema Malini
parliament

More Telugu News