Patnam Subbaiah: మరో గుడ్ బై... చంద్రబాబుకు రాజీనామా లేఖ పంపిన మాజీ మంత్రి!

  • పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన పట్నం సుబ్బయ్య
  • పలమనేరు నుంచి మూడు సార్లు గెలిచిన పట్నం
  • ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో మంత్రిగా విధులు
మూడు సార్లు  పలమనేరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్‌ తో పాటు చంద్రబాబు క్యాబినెట్లో సైతం మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య టీడీపీకి రాజీనామా చేశారు. తన ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో పాటు కుటుంబ పరిస్థితులే తన రాజీనామాకు కారణమని రాజీనామా లేఖలో పట్నం సుబ్బయ్య వెల్లడించారు. ఈ లేఖను జిల్లా పార్టీ అధ్యక్షుడు పులివర్తి నానీకి, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఈ-మెయిల్‌ ద్వారా పంపారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత తెలుగుదేశం పార్టీకి పలువురు దూరమవుతున్న సంగతి తెలిసిందే.
Patnam Subbaiah
Telugudesam
Resign
Chandrababu

More Telugu News