Andhra Pradesh: ఏపీ మంత్రి పేర్ని నాని వేధింపులు తాళలేక జయలక్ష్మి ఆత్మహత్యాయత్నం చేసింది!: నారా లోకేశ్

  • మహిళా హోంమంత్రి రాష్ట్రంలో మహిళలకే రక్షణ లేదు
  • వైసీపీ మూకలు ఇంకెంతమందిని బలిగొంటారో?
  • సీఎం గారు.. రాజన్న రాజ్యం అంటే ఇదేనా?
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన టీడీపీ నేత
ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మహిళలకే రక్షణ లేకుండా పోయిందని టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేశ్ విమర్శించారు. ఏపీ మంత్రి పేర్ని నాని వేధింపులు తాళలేక జయలక్ష్మి అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసిందని ఆరోపించారు.

మంత్రి హోదాలో ఉన్న పేర్ని నానియే వేధింపులకు పాల్పడితే ఇక వైసీపీ మూకలు ఇంకెంత మందిని బలితీసుకుంటాయో! అని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం జగన్ గారూ.. రాజన్న రాజ్యం అంటే ఇదేనా? అని లోకేశ్ ట్విట్టర్ లో ప్రశ్నించారు.
Andhra Pradesh
perni nani
Telugudesam
Nara Lokesh
Twitter
harassment
woman commit suicide

More Telugu News