Kesineni Nani: పేరు చెప్పకుండా కేశినేని నాని సెటైర్... లోకేశ్ పైనేనని కామెంట్లు!

  • ఓట్లను సంపాదించలేని వాళ్లకు పదవులు
  • పదాలు చదవలేనివాళ్లు ట్వీట్లు చేస్తున్నారు
  • చాలా దౌర్భాగ్యమన్న కేశినేని నాని
ఏమీ తెలియని వారు, ఏమీ చేయలేని వారు కూడా ట్వీట్లు చేస్తుండటం దౌర్భాగ్యమని విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఓ ట్వీట్ పెట్టగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. "నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు, నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేనివాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్ చేస్తున్నాడు. దౌర్భాగ్యం!" అని నాని వ్యాఖ్యానించారు. కాగా, ఈ ట్వీట్ ను ఎవరిని ఉద్దేశించి పెట్టారో మాత్రం ఆయన చెప్పక పోవడం గమనార్హం. ఇక దీనిపై "భలే చెప్పావు మీ లోకేశం గురించి" అని, "పక్కా ట్వీటేశ్ గురించేగా?" అని, "లోకేష్ గారి గురించి బాగా చెప్పారు" అని కామెంట్లు వస్తుండటం గమనార్హం. ఇక తాను చేసిన ట్వీట్ లోకేశ్ గురించా? అన్న విషయాన్ని మాత్రం నాని ఇంకా స్పష్టం చేయలేదు.
Kesineni Nani
Nara Lokesh
Twitter

More Telugu News