Yanamala: వైసీపీ నేతల చేతకానితనానికి ఇదొక నిదర్శనం: యనమల

  • తొలి బడ్జెట్ లోనే బొక్కబోర్లా పడ్డారు
  • నవ రత్నాలు కాదు.. నవ కోతలు, నవ రద్దులు
  • పాత పథకాలకు నవరత్నాల ముసుగు వేస్తున్నారు
తొలి బడ్జెట్ లోనే వైసీపీ నేతలు బొక్కబోర్లా పడ్డారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 500 కోట్లు కేటాయించడమే వైసీపీ నేతల చేతకానితనానికి నిదర్శనమని అన్నారు. వైసీపీవి నవరత్నాలు కాదని... నవ కోతలు, నవ రద్దులు అని విమర్శించారు. పాత పథకాలకే నవరత్నాల ముసుగు వేస్తున్నారని దుయ్యబట్టారు. పథకాల పేర్లు మార్చినంత మాత్రాన... ప్రజల మనసుల్లో నుంచి టీడీపీని తొలగించలేరని చెప్పారు. బడ్జెట్ లో ఎన్ని పథకాలను రద్దు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కరువు నివారణపై బడ్జెట్ లో ప్రస్తావనే లేదని అన్నారు. రీటెండరింగ్ పేరుతో అమరావతి, పోలవరం పనులకు గండి కొట్టారని విమర్శించారు.  
Yanamala
Telugudesam
YSRCP

More Telugu News