Andhra Pradesh: విజయసాయిరెడ్డి! అమరావతిపై చర్చకు నేను సిద్ధం.. సమయం, తేదీ ఫిక్స్ చేయండి!: బుద్ధా వెంకన్న

  • చంద్రబాబు హయాంలో అమరావతి పరుగులుపెట్టింది
  • ఇప్పుడేమో అమరావతి అంధకారంగా మారింది
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ నేత
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు హయాంలో అమరావతి నిర్మాణం పరుగులు పెట్టిందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తెలిపారు. కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి అంధకారంగా మారిందని విమర్శించారు. టీడీపీ హయాంలో జరిగిన అమరావతి అభివృద్ధి, వైసీపీ పాలనలో సాగుతున్న అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. ఈ చర్చ కోసం తేదీ, సమయాన్ని ఫిక్స్ చేయాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు.

ఓవైపు సీఎం జగన్ ఇంటి ముందు రోడ్డుకు రూ.5 కోట్లు ఖర్చుచేసిన ప్రభుత్వం బడ్జెట్ లో రాజధాని అమరావతికి మాత్రం రూ.500 కోట్లు కేటాయించిందని తెలిపారు. దీన్ని బట్టే వైసీపీ నేతలు ఇచ్చింది గ్రాఫిక్స్ హామీలని అర్థమవుతోందన్నారు. అమరావతి గురించి ట్విట్టర్ లో మాట్లాడటం కాదనీ, ధైర్యం ఉంటే అవే మాటలను ఖాళీ అయిన రాజధాని రైతుల మధ్య నిలబడి మాట్లాడాలని డిమాండ్ చేశారు.
Andhra Pradesh
YSRCP
Twitter
Vijay Sai Reddy
budha venkanna
Chandrababu
Telugudesam

More Telugu News