Viyayashanthi: తెలంగాణ సంక్షేమం కోసం.. ఆ పోరాటానికి నేను కూడా సిద్ధమే!: విజయశాంతి

  • టీఆర్ఎస్ పార్టీ నియంతృత్వ పోకడలకు పోతోంది
  • ప్రతిపక్ష పరిస్థితి నామమాత్రమే అన్నట్టుగా వ్యవహరిస్తోంది
  • టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి
టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ నియంతృత్వ పోకడలకు పోతోందని విమర్శించారు. జాతీయ కాంగ్రెస్ లో తలెత్తిన అనిశ్చిత పరిస్థితులను టీఆర్ఎస్ ఆసరాగా తీసుకుందని... రాష్ట్రంలో కాంగ్రెస్ కు చెందిన ప్రజాప్రతినిధులు పార్టీలు మారడాన్ని అనుకూలంగా మలుచుకుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పరిస్థితి నామమాత్రమే అన్నట్టుగా వ్యవహరిస్తోందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ గుర్తించాల్సిందేమిటంటే ... ప్రస్తుత సంక్షోభ సమయాన్ని అధిగమించి, అధికార పార్టీ ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు విపక్షాలన్నీ ఏకమవుతున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తిగా... ఆ పోరాటానికి తాను కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
Viyayashanthi
Congress
TRS

More Telugu News