KCR: మీరు చెప్పింది అక్షరాలా నిజం జగన్ గారూ!: కేశినేని నాని

  • కేసీఆర్ గోదావరి జలాలను ఏపీకి ఇస్తున్నారని పేర్కొన్న జగన్
  • ఆయనది గొప్ప ఔదార్యం అంటూ ఆకాశానికెత్తేసిన వైనం
  • ట్విట్టర్ లో సెటైర్ వేసిన నాని
తెలంగాణ గడ్డపై నుంచే గోదావరి జలాలను ఏపీకి ఇస్తున్న కేసీఆర్ ది గొప్ప ఔదార్యం అంటూ సీఎం జగన్ పేర్కొనడంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని సెటైర్ విసిరారు. "నిజమే జగన్ గారూ! కేసీఆర్ ది గొప్ప ఔదార్యమే. అంత ఔదార్యం ఉంది కాబట్టే మీకు ఎన్నికల్లో కూడా సాయం చేశారు" అంటూ ట్వీట్ చేశారు. ఎన్నికల సమయంలో జగన్ కు కేసీఆర్ నిధులు పంపించాడంటూ ప్రత్యర్థి పార్టీలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకునే నాని సీఎం జగన్ పై వ్యంగ్యాస్త్రం సంధించారు.
KCR
Jagan
Kesineni Nani
Andhra Pradesh
Telangana

More Telugu News