Jagan: జగన్ పై సభాహక్కుల నోటీసు ఇచ్చిన టీడీపీ

  • సున్నా వడ్డీపై అట్టుడుకుతున్న శాసనసభ
  • అసత్యాలు మాట్లాడిన సీఎంపై చర్యలు తీసుకోవాలంటూ సభాహక్కుల నోటీసు
  • చర్చకు సిద్ధంగా ఉన్నామన్న జగన్
ఏపీ శాసనసభ సమావేశాలు అట్టుడుకుతున్నాయి. సున్నా వడ్డీ అంశంపై అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరు పక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. మరోవైపు, ముఖ్యమంత్రి జగన్ పై శాసనసభలో టీడీపీ సభాహక్కుల నోటీసు ఇచ్చింది. సున్నా వడ్డీపై నిన్న జరిగిన చర్చలో తమపై నిరాధార ఆరోపణలు చేశారని, అందుకే నోటీసు ఇస్తున్నామని టీడీపీ తెలిపింది. అసత్యాలు మాట్లాడి, సభను పక్కదోవ పట్టించిన ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు ఇచ్చిన నోటీసులో పేర్కొంది. సున్నా వడ్డీపై నిన్న జరిగిన చర్చపై నేటి సమావేశాల్లో కూడా టీడీపీ చర్చను ప్రారంభించింది. మరోవైపు, సున్నా వడ్డీపై చర్చకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని జగన్ తెలిపారు.
Jagan
Previlage Motion
Andhra Pradesh
Assembly
Telugudesam
YSRCP

More Telugu News