Australia: సగం పని పూర్తిచేసిన ఇంగ్లాండ్ ఓపెనర్లు

  • ఇంగ్లాండ్ టార్గెట్ 224 రన్స్
  • ప్రస్తుత స్కోరు 16 ఓవర్లలో 116/0
  • అర్ధసెంచరీ సాధించిన జాసన్ రాయ్
బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో ఇంగ్లాండ్ ఓపెనర్లు ధాటిగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఆస్ట్రేలియాతో ప్రపంచకప్ సెమీఫైనల్ పోరులో 224 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ జట్టు 16 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 116 పరుగులు చేసింది. ఓపెనర్లు జాసన్ రాయ్ 73, జానీ బెయిర్ స్టో 33 పరుగులతో ఆడుతున్నారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, బెహ్రెన్ డార్ఫ్, ప్యాట్ కమ్మిన్స్ వంటి ప్రతిభావంతులైన పేసర్లు ఉన్నా బ్రేక్ ఇవ్వడంలో మాత్రం విఫలమయ్యారు. బాదడం తమకు అలవాటే అన్న రీతిలో ఇంగ్లాండ్ ఓపెనర్లు బౌండరీలు కొడుతుంటే ఆసీస్ ఫీల్డర్లు నిస్సహాయుల్లా చూడాల్సివస్తోంది.

కాగా, ఆతిథ్య జట్టు విజయానికి ఇంకా 34 ఓవర్లలో 108 పరుగులు చేయాలి. కాగా, స్మిత్ విసిరిన ఓ ఓవర్లో రాయ్ వరుసగా మూడు భారీ సిక్స్ లు కొట్టడం విశేషం. వాటిలో చివరి సిక్స్ మైదానం బయటపడిందంటే రాయ్ ఎంత బలంగా కొట్టాడో అర్థమవుతుంది.
Australia
England
World Cup

More Telugu News