Andhra Pradesh: వ్యాపారవేత్త రాంప్రసాద్ హత్య కేసులో కొత్త ట్విస్ట్!

  • రాంప్రసాద్ ను చంపింది ప్రసాద్ అంటున్న పోలీసులు
  • శ్యామ్ కు సంబంధంలేదన్న పోలీసులు!
  • ఇటీవలే హత్యకు గురైన రాంప్రసాద్
కొన్నిరోజుల క్రితం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో వ్యాపారవేత్త రాంప్రసాద్ దారుణహత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. వ్యాపార లావాదేవీల్లో విభేదాలే ఆయన హత్యకు కారణమని భావించినా, హత్య చేసింది ఎవరో స్పష్టం కాలేదు. శ్యామ్ అనే వ్యక్తి తానే రాంప్రసాద్ ను హత్యచేశానంటూ తెరపైకి వచ్చినా, పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

బిజినెస్ పార్ట్ నర్ కోగంటి సత్యంతో విభేదాలే రాంప్రసాద్ హత్యకు కారణమని గుర్తించిన పోలీసులు, రాంప్రసాద్ ను చంపింది శ్యామ్ కాదని తెలుసుకున్నారు. శ్యామ్ ఈ హత్య జరిగిన ప్రాంతంలో దూరంగా నిలబడి మానిటరింగ్ చేశాడని, రాంప్రసాద్ ను చంపింది ప్రసాద్ అని, అతడికి చిన్నూ, రమేశ్ అనే వ్యక్తులు సహకరించారని పోలీసుల విచారణలో తేలింది. ప్రసాద్ ను కోగంటి సత్యంకు అనుచరుడిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో, లొంగిపోయిన శ్యామ్ అసలు హంతకుడు కాదని తేల్చారు.
Andhra Pradesh
Telangana
Hyderabad

More Telugu News