Shalini Pandey: షాలినీ పాండేకి అవకాశాలు తగ్గడానికి అదే కారణమట

  • యూత్ లో షాలినీ పాండేకి మంచి క్రేజ్
  • ఆశించిన స్థాయిలో పెరగని జోరు
  • అంతకంతకూ తగ్గుతోన్న అవకాశాలు    
'అర్జున్ రెడ్డి' సినిమాతో షాలినీ పాండేకి యూత్ లో విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. దాంతో ఈ అమ్మాయి హవా కొనసాగడం ఖాయమని చాలామంది అనుకున్నారు. కానీ ఆ స్థాయిలో ఆమె జోరు పెరగకపోగా, అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. అవకాశాలను దక్కించుకోవడంలో ఆమె విఫలమవుతోందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.

అయితే ఇప్పటికీ ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయనీ, ఆమె ధోరణి కారణంగానే వెనక్కి వెళుతున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. తన పాత్ర పరిథి ఎక్కువగా ఉండాలనీ, తక్కువగా వుంటే చేయనని షాలినీ పాండే చెప్పేస్తోందట. అలాగే తన డేట్స్ కావాలంటే తాను అడిగినంత పారితోషికం ఇవ్వాల్సిందేనని అంటోందట. ఆమె ఇలా భీష్మించుకుని కూర్చోవడం వల్లనే అవకాశాలు తగ్గిపోతున్నాయని చెప్పుకుంటున్నారు.
Shalini Pandey

More Telugu News