Rajya Sabha: రాజ్యసభలో టీమిండియా ప్రస్తావన తీసుకువచ్చిన చిదంబరం

  • కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో సంక్షోభంపై చిదంబరం స్పందన
  • బీజేపీపై పరోక్ష విమర్శలు
  • ఆర్థికస్థితిపై ఆందోళన
రాజ్యసభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రతిరోజు దెబ్బతింటున్నందుకు ఎంతో బాధపడుతున్నానని తెలిపారు. వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియా ఓడిపోయినందుకే కాదు, ఇతర పార్టీల కంటే తామే గొప్ప అని నిరూపించుకోవడానికి కర్ణాటక, గోవా వంటి రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రయత్నాల పట్ల కూడా బాధపడుతున్నాను అంటూ పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను, పార్టీలను దెబ్బతీసే ప్రయత్నాలు దేశ ఆర్థిక పరిస్థితికి నష్టం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ లోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, అస్థిరత అంశాలను విదేశీ పెట్టుబడిదారులు గమనిస్తున్నారని, ఇది దేశ ఆర్థికస్థితికి ఏమాత్రం శుభపరిణామం కాదని అన్నారు.
Rajya Sabha
Chidambaram
Congress
BJP
Karnataka
Goa

More Telugu News