Nara Lokesh: తుపాను అనగానే అట్నుంచి అటే హైదరాబాద్ చెక్కేసిన మీరు ఇచ్చిన మాట మర్చిపోయారా జగన్ గారూ!: లోకేశ్

షార్ట్స్‌లో చూడండి
అధికారంలోకి రాగానే తిత్లీ తుపాను నష్టాన్ని భర్తీ చేస్తామంటూ ఇచ్చిన హామీ మర్చిపోయారా జగన్ గారూ అంటూ టీడీపీ యువనేత నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. తుపాను అనగానే అట్నుంచి అటే హైదరాబాద్ వెళ్లిపోయిన మీరు, సిక్కోలు ప్రజలకు ఎలాంటి హామీ ఇచ్చారో ఓసారి గుర్తుచేసుకోండి జగన్ గారూ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

"తుపాను అంతా అయిపోయాక తీరిగ్గా వెళ్లి తిత్లీ తుపాను నష్టం రూ.3.435 కోట్లను బాధితులకే నేరుగా ఇస్తానని చెప్పారు. ఆ హామీ ఏమైందని సిక్కోలు ప్రజలు అడుగుతున్నారు జగన్ గారూ, ఆ మాట గాలికేమైనా కొట్టుకుపోయిందా?" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. తిత్లీ తుపాను బాధితులను జగన్ పరామర్శించిన వేళ ఇచ్చిన హామీ తాలూకు వార్త క్లిప్పింగ్ ను కూడా లోకేశ్ తన ట్వీట్ లో పొందుపరిచారు.
Go Back to Shorts
Nara Lokesh
Jagan
Andhra Pradesh

More Telugu News