Dhoni: ధోనీ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దు: సచిన్

  • రిటైర్మెంట్ విషయాన్ని ధోనీకే వదిలేయాలి
  • దేశ క్రికెట్ చరిత్రలో ధోనీది ఒక ప్రత్యేకమైన స్థానం
  • ధోనీని అందరూ గౌరవించాలి
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ రిటైర్మెంట్ పై పలు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ... రిటైర్మెంట్ విషయాన్ని ధోనీకే వదిలేయాలని, ఇందులో ఎవరూ జోక్యం చేసుకోవద్దని సూచించారు. దేశానికి ధోనీ అందించిన సేవలు అసమాన్యమైనవని.... ధోనీని అందరూ గౌరవించాలని చెప్పాడు. భారత్ క్రికెట్ చరిత్రలో ధోనీది ఒక ప్రత్యేకమైన స్థానమని తెలిపాడు. న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్లో ధోనీ క్రీజులో ఉన్నంత వరకు ఇండియా ఓడిపోలేదని... మ్యాచ్ ను అతడు గెలిపిస్తాడనే నమ్మకం అందరిలో ఉందని చెప్పాడు.
Dhoni
Sachin Tendulkar
Team India

More Telugu News