BJP: బీజేపీలో టీడీపీని విలీనం చేయాలన్న జేసీ వ్యాఖ్యలు దురదృష్టకరం: వెంకటసుబ్బారెడ్డి

  • ఎన్నో సవాళ్లు ఎదురైనా టీడీపీ వెనకడుగు వేయలేదు
  • కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడవద్దు
  • బీజేపీలో విలీనం చేయాల్సిన ఖర్మ పట్టలేదు
తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేస్తే బాగుంటుందని ఆ పార్టీ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తప్పుపట్టారు. టీడీపీ ఆవిర్భావం నుంచి తాను పార్టీలో ఉన్నానని... ఎన్టీఆర్, చంద్రాబులను దగ్గర నుంచి చూశానని చెప్పారు. ఎన్నో సవాళ్లు ఎదురైనా వెనుకడుగు వేయలేదని... వరుసగా పదేళ్లు అధికారంలో లేకపోతే ఏ పార్టీ అయినా మనుగడ సాగించడం కష్టమని... అయితే కార్యకర్తల అండతో పార్టీని చంద్రబాబు మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చారని తెలిపారు. సంచలనం కోసం కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడవద్దని చెప్పారు. బీజేపీని టీడీపీలో విలీనం చేయాల్సిన ఖర్మ పట్టలేదని అన్నారు.
BJP
Telugudesam
JC Prabhakar Reddy
Redyam Venkata Subba Reddy

More Telugu News