Chiranjeevi: ఐశ్వర్యరాయ్ ను సంప్రదించనున్న కొరటాల?

షార్ట్స్‌లో చూడండి
చిరంజీవి కథానాయకుడిగా 'సైరా' నిర్మితమవుతోంది. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమా తరువాత కొరటాలతో కలిసి చిరూ సెట్స్ పైకి వెళ్లనున్నారు. చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22న ఈ సినిమా ను లాంచ్ చేసే అవకాశాలు వున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో హీరో పాత్రతో పాటు హీరోయిన్ పాత్రకి కూడా చాలా ప్రాముఖ్యత వుంటుందట. అందువలన ఐశ్వర్యరాయ్ అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని చరణ్ దగ్గర కొరటాల వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆ పాత్రకి ఆమె సెట్ అవుతుందనుకుంటే ఖర్చు గురించి ఆలోచించవద్దని కొరటాలతో చరణ్ అన్నాడట. దాంతో ఐశ్వర్యరాయ్ కి కథను వినిపించి, ఆమెను ఒప్పించడానికి కొరటాల సిద్ధమవుతున్నాడని అంటున్నారు. ఐశ్వర్యరాయ్ ఏమంటుందో చూడాలి మరి. 
Go Back to Shorts
Chiranjeevi
KOratala

More Telugu News