Andhra Pradesh: పొలంలో నాట్లు వేయాల్సిన రైతు.. విత్తనాల కోసం రోడ్డెక్కి సిగపట్లు పడుతున్నాడు!: నారా లోకేశ్ ఆగ్రహం

  • రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోలేదు
  • ఏదీ చూడకుండా రైతు దినోత్సవం జరిపేసింది
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ ఎమ్మెల్సీ
టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ ఏపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో రైతుల సమస్యలను పరిష్కరించకుండానే రైతు దినోత్సవం జరిపిందని విమర్శించారు. ఈరోజు ట్విట్టర్ లో నారా లోకేశ్ స్పందిస్తూ..‘పొలంలో నాట్లు వేసుకోవాల్సిన రైతు, విత్తనాల కోసం రోడ్డెక్కి సిగపట్లు పడుతున్నాడు. రైతు సమస్యలు తీర్చకుండానే.. ప్రభుత్వం రైతు దినోత్సవం జరిపేసుకుంది’ అని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా విత్తనాల కోసం ప్రజలు ఎగబడుతున్న వీడియోను తన ట్వీట్ కు జతచేశారు.
Andhra Pradesh
Telugudesam
Nara Lokesh
farmers
Twitter
video

More Telugu News