budha venkanna: వైసీపీనీ వదిలిపెట్టేది లేదు... దానికి టైముంది, అంతే!: బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు

షార్ట్స్‌లో చూడండి
అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వారిని విడిచిపెట్టేది లేదని, కాకుంటే దానికి ఇంకా సమయం ఉందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఈరోజు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నతో కలిసిన సందర్భంగా ఇద్దరు నాయకుల మధ్య కాసేపు సరదా సంభాషణ చోటు చేసుకుంది. తొలుత వెంకన్న మాట్లాడుతూ ‘అన్నా...ఇన్నాళ్లు టీడీపీని విమర్శించారు. ఇక చాలించి వైసీపీ సంగతి చూడండి’ అని సోము వీర్రాజును ఉద్దేశించి అన్నారు.

దీనిపై ఆయన అదే రీతిలో స్పందిస్తూ వైసీపీని కూడా విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నిత్యం విమర్శల జడివాన కురిపించిన సోము వీర్రాజు ఇటీవల కాలంలో కొంత మౌనంగా ఉన్న విషయం తెలిసిందే. దీన్నే వెంకన్న గుర్తు చేశారు. వీరిద్దరి సంభాషణ విన్న తోటి సభ్యులు మాత్రం నవ్వుల్లో మునిగి తేలారు.
Go Back to Shorts
budha venkanna
somu veerraju
assembly loby

More Telugu News