Nara Lokesh: ఇది మన రోజు కాదు... టీమిండియా ఓటమిపై నారా లోకేశ్ స్పందన

  • గుండె పగిలినంత పనైంది
  • జడేజా, ధోనీ పోరాటం అభినందనీయం
  • ట్వీట్ చేసిన లోకేశ్
ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ నుంచి టీమిండియా నిష్క్రమించడంపై టీడీపీ యువనేత నారా లోకేశ్ స్పందించారు. న్యూజిలాండ్ చేతిలో సెమీఫైనల్ ఓటమి అనంతరం గుండె పగిలినంత పనైందని తెలిపారు. ఇది మన రోజు కాదని, జడేజా, ధోనీ పోరాడిన తీరు ఎంత చెప్పినా తక్కువేనని కొనియాడారు. ఈ టోర్నీ ఆసాంతం కోహ్లీ, ఇతర జట్టు సభ్యులు సర్వశక్తులు ధారపోసి ఆడిన తీరు అభినందనీయం అని లోకేశ్ కొనియాడారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

కాగా, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూడా టీమిండియా ఓటమి పట్ల విభిన్నంగా స్పందించారు. భారత జట్టు లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడం ద్వారా వరల్డ్ కప్ ను ఎప్పుడో గెలిచిందని, ఇప్పుడు ఓడిపోయినందుకు బాధపడాల్సిన పనిలేదని తెలిపారు. లీగ్ దశలో ప్రతి జట్టు ఇతర జట్టుతో ఆడాల్సి ఉంటుందని, ఆ లెక్కన అన్ని జట్ల కంటే మెరుగ్గా నిలిచింది టీమిండియానే అని అమీర్ ఖాన్ వివరించారు.
Nara Lokesh
Team India
New Zealand
World Cup

More Telugu News