Shruthi Hassan: నాకు కొంచెం ప్రేమ, గౌరవం, ప్రశాంతత కావాలి: శ్రుతి హాసన్

  • నన్ను నేను పట్టించుకునే తీరిక కూడా లేదు
  • ఇలాంటి పరిస్థితి ప్రతి వ్యక్తికీ వస్తుంది
  • ఇంత కాలం పాటు ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నా
  • ప్రస్తుతం ఆ విమర్శలేవీ నన్ను బాధించట్లేదు
కాటమరాయుడు సినిమా నుంచే చాలా బొద్దుగా తయారై విమర్శలెదుర్కొన్న కథానాయిక శ్రుతి హాసన్, ఆ తరువాత కొంత కాలం పాటు సినిమాలకు దూరమైంది. ఆ సమయంలో మరింత లావైపోయి నెటిజన్ల నుంచి లెక్కలేనన్ని విమర్శలను ఎదుర్కొంది. తాజాగా శ్రుతి ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ తాను బరువెక్కిన సమయంలో ఎదుర్కొన్న విమర్శల గురించి వివరించింది.

తనకు పెళ్లై పోయిందని, అందుకే లావెక్కానని, ఇలా తనపై నెటిజన్లు చాలా విమర్శలు గుప్పించారని పేర్కొంది. ఆ కామెంట్లు తనను చాలా బాధించేవని కానీ తన అనారోగ్య సమస్యల గురించి ప్రేక్షకులకు తెలియదు కదా అని సరిపెట్టుకున్నానని తెలిపింది. తనను తాను పట్టించుకునేంత తీరిక గత పదేళ్లలో లేదని.. ఇలాంటి పరిస్థితి ప్రతి వ్యక్తికీ వస్తుందన్నారు. ఇంత కాలం పాటు ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నానని, కానీ ప్రస్తుతం తనను అవేమీ బాధించట్లేదని శ్రుతి తెలిపింది. తనకు కాస్త ప్రేమ, గౌరవం, ప్రశాంతత కావాలని పేర్కొంది.
Shruthi Hassan
Katama Rayudu
Marriage
Health Condition
Love
Respect

More Telugu News