India: ఉసూరుమంటున్న అభిమానుల్లో ఆశలు కలిగిస్తున్న ధోనీ, జడేజా

  • భారత్ స్కోరు 40 ఓవర్లలో 150/6
  • విజయానికి కావాల్సింది 10 ఓవర్లలో 90 పరుగులు  
  • వరల్డ్ కప్ సెమీస్
న్యూజిలాండ్ జట్టుతో వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఎవరూ ఊహించని విధంగా టీమిండియా టాపార్డర్ విఫలమైన వేళ, రవీంద్ర జడేజా, ధోనీ జోడీ పోరాటం కొనసాగిస్తోంది. హార్దిక్ పాండ్యా ఆరో వికెట్ రూపంలో అవుట్ కాగా, బరిలోకొచ్చిన జడేజా దూకుడుగా ఆడుతూ విజయంపై ఆశలు రేకెత్తిస్తున్నాడు. వరుసగా వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో డీలాపడిపోయిన టీమిండియా అభిమానులకు ఈ జోడీ ఆటతీరు ఉత్సాహం కలిగిస్తోంది. ప్రస్తుతం టీమిండియా 40 ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసింది. గెలవడానికి ఇంకా 10 ఓవర్లలో 90 పరుగులు చేయాలి. క్రీజులో జడేజా (39), ధోనీ (24) ఉన్నారు.
India
New Zealand

More Telugu News