Telugudesam: టీడీపీకి మరో షాక్.. రాజీనామా చేయనున్న ఎమ్మెల్సీ సతీష్

  • ఎమ్మెల్సీ పదవికి కాసేపట్లో రాజీనామా చేయనున్న సతీష్
  • పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్టు సమాచారం
  • ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయంలో ఇంకా రాని స్పష్టత
ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్సీ అన్నం సతీష్ కాసేపట్లో తన పదవికి రాజీనామా చేయనున్నారు. టీడీపీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేయనున్నట్టు సమాచారం. గుంటూరు జిల్లాలో కీలక నేతగా ఉన్న ఆయన 2014లో వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి చేతిలో ఓటమిని చవిచూశారు. అయితే, పార్టీ కోసం ఆయన చేసిన కృషిని గుర్తించిన చంద్రబాబు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. అన్నం సతీష్ రాజీనామా వార్త ప్రస్తుతం గుంటూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారన్న అంశంలో ఇంకా స్పష్టత రాలేదు.
Telugudesam
Allam Satish
Guntur District

More Telugu News