DK Shivakumar: డీకే శివకుమార్ అరెస్ట్... హోటల్ దగ్గర నుంచి తరలింపు

  • రసవత్తర మలుపు తిరిగిన కర్ణాటక రాజకీయం
  • డీకేతో పాటు ఆయన వెంట ఉన్న కాంగ్రెస్ నేతల అరెస్ట్
  • కలినా యూనివర్శిటీ రెస్ట్ హౌస్ కు తరలింపు
కర్ణాటక రాజకీయం మరో రసవత్తర మలుపు తిరిగింది. ముంబైలో మకాం వేసిన అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు వెళ్లిన కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 10 మంది రెబెల్ ఎమ్మెల్యేలు బస చేసిన రినైసెన్స్ హోటల్ లోకి వెళ్లేందుకు శివకుమార్ కు పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఆ ప్రాంతంలో 144 సెక్షన్ కూడా విధించారు. అయితే అక్కడి నుంచి వెళ్లేందుకు ఆయన నిరాకరించడంతో... ఆయనను, ఆయనతో పాటు ఉన్న ఇతర నేతలను అదుపులోకి తీసుకున్నారు. కలినా యూనివర్శిటీ రెస్ట్ హౌస్ కు వీరిని పోలీసులు తరలిస్తున్నారు.
DK Shivakumar
Congress
Arrest
Mumbai
Karnataka

More Telugu News