: గవర్నర్ ఢిల్లీలోనే మకాం.. కీలక చర్చలు!


రాష్ట్రాల గవర్నర్ల సమావేశం ముగిసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నరసింహన్ ఢిల్లీలోనే మకాం వేశారు. ఈ ఉదయం కేంద్ర హోంశాఖ, ఇంటెలిజెన్స్ అధికారులతో సమావేశమై చర్చించారు. తర్వాత కేంద్ర హోం మంత్రి షిండేతో భేటీ అయ్యారు. తెలంగాణ సహా రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హోంశాఖ, ఇంటెలిజెన్స్ అధికారులతో భేటీ అవడం వెనుక తెలంగాణ అంశంపైనే కీలక సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. గవర్నర్ నరసింహన్ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీతో కూడా ఈ రోజు సమావేశం అవుతారని తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News