KCT: కేసీఆర్ సొంత గ్రామం చింతమడకకు రూ. 10 కోట్ల మంజూరు

  • అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక నిధి నుంచి నిధుల మంజూరు
  • సంతోషం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు
  • త్వరలో చింతమడక వెళ్లనున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామం చింతమడకకు ప్రభుత్వం రూ. 10 కోట్లు విడుదల చేసింది. సిద్ధిపేట జిల్లాలో కేసీఆర్ స్వగ్రామం చింతమడక ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక నిధి నుంచి ఈ నిధులను మంజూరు చేశారు. మరోవైపు, త్వరలోనే తన స్వగ్రామం చింతమడకలో కేసీఆర్ పర్యటించనున్నారు. తమ గ్రామానికి ప్రత్యేక నిధులను విడుదల చేయడంపై చింతమడక గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
KCT
Chintamadaka
TRS

More Telugu News