samantha: నయనతార ప్లేస్ లో సమంత?

  • 'ఓ బేబీ'తో హిట్ కొట్టిన సమంత
  •  సమంతను సంప్రదిస్తున్న గోపీ నైనార్
  • 'అరమ్' సీక్వెల్ కి సన్నాహాలు
సమంత తాజా చిత్రంగా వచ్చిన 'ఓ బేబీ' తొలిరోజునే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. నటన పరంగా ఈ సినిమా సమంతకి ప్రశంసలు తెచ్చిపెడుతోంది. 'యూ టర్న్' తరువాత నాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రంగా వచ్చిన 'ఓ బేబీ'తో, దర్శక నిర్మాతలందరి దృష్టి ఇప్పుడు సమంతపైనే వుంది. నాయిక ప్రాధాన్యత కలిగిన కథలను సిద్ధం చేసుకున్నవారు గతంలో నయనతారనో .. లేదంటే త్రిషనో సంప్రదించేవారు. కానీ ఇప్పుడు వాళ్లంతా సమంత వైపు మొగ్గు చూపుతున్నారనేది ఫిల్మ్ నగర్ టాక్.

ఇక తమిళంలో ఇంతకుముందు నయనతార ప్రధాన పాత్రధారిగా వచ్చిన 'అరమ్'(కర్తవ్యం) జనాదరణ పొందింది. ఆ సినిమాకి సీక్వెల్ ను రూపొందించడానికి దర్శకుడు గోపీ నైనార్ సన్నాహాలు చేసుకుంటున్నాడు. కథానాయికగా ముందుగా ఆయన నయనతారను అనుకున్నప్పటికీ, ఇప్పుడు సమంతను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.
samantha
Nayajnathara

More Telugu News