Shanthi Swaroop: హైపర్ ఆది పంచ్ లకు ఆనందమే తప్ప బాధ కలగదు: 'జబర్దస్త్' శాంతిస్వరూప్

  • 'జబర్దస్త్'తో పాప్యులర్ అయ్యాను
  • నా రూపంపై హైపర్ ఆది పంచ్ లు ఉంటాయి
  • ఆయన వల్లనే పేరొచ్చిందన్న శాంతిస్వరూప్
'జబర్దస్త్' కామెడీ షో ద్వారా బాగా పాప్యులర్ అయిన నటులలో శాంతిస్వరూప్ కూడా కనిపిస్తాడు.  ఆది టీమ్ లోను .. అవినాశ్ టీమ్ లోను ఆయన లేడీ గెటప్పులు వేస్తుంటాడు. సన్నగా .. పీలగా వుండే శాంతిస్వరూప్ రూపంపై హైపర్ ఆది పంచ్ లపై పంచ్ లు వేస్తుంటాడు.

తాజాగా ఈ విషయంపై శాంతిస్వరూప్ స్పందిస్తూ, "నేను ఎక్కడికైనా వెళ్లినప్పుడు 'హైపర్ ఆది మీ పర్సనాలిటీపై అంతగా పంచ్ లు వేస్తాడు గదా .. మీకు బాధగా అనిపించదా?' అని అడుగుతుంటారు. హైపర్ ఆది పంచ్ ల వలన స్కిట్ బాగా రావాలని అనుకుంటానేగానీ, నన్నేదో అనేశారని బాధపడను. హైపర్ ఆది పంచ్ లు ఆ షో వరకే. అందుకే నాపై ఆయన ఎన్ని పంచ్ లు వేస్తే నేను అంత హ్యాపీగా ఫీలవుతాను. ఆయన స్కిట్లు చేయడం వల్లనే నాకు మంచి గుర్తింపు వచ్చింది" అని చెప్పుకొచ్చాడు. 
Shanthi Swaroop

More Telugu News