Rajanna Sircilla District: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వింత... గేదె కడుపున పందిని పోలిన దూడ జననం!

  • నాలుగు రోజుల క్రితం గేదెను కొన్న రైతు
  • పంది ఆకారంలో పుట్టిన వింత జీవి
  • ఆశ్చర్యానికి లోనవుతున్న ప్రజలు
తెలంగాణలోని రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఓ వింత ఘటన చోటు చేసుకోగా, విషయం తెలుసుకున్న ప్రజలు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. సిరిసిల్లకు సమీపంలోని చిన్నబోనాల ప్రాంతంలో ఓ గేదె కడుపున పంది ఆకారంలో జంతువు పుట్టింది. గ్రామానికి చెందిన మల్లయ్య అనే రైతు, నాలుగు రోజుల క్రితం పశువుల సంతకు వెళ్లి, ఓ రైతు వద్ద నుంచి గేదెను కొనుగోలు చేసి తెచ్చాడు. అది ప్రసవించగా, పంది ఆకారంలో ఉన్న వింత జీవి జన్మించింది. దీన్ని చూసేందుకు సమీప ప్రాంతాల ప్రజలు పెద్దఎత్తున ఆసక్తిని చూపారు. బహుశా నెలలు నిండకపోవడం వల్లే, ఇటువంటి జీవి పుట్టి ఉండవచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు.
Rajanna Sircilla District
Pig
Bufallow

More Telugu News