Salman Khan: 'ఊర్వశీ.. ఊర్వశీ.. టేకిట్ ఈజీ ఊర్వశీ' పాటకు ప్రభుదేవాతో కలసి డ్యాన్స్ చేసిన సల్మాన్, సుదీప్.. వీడియో ఇదిగో

షార్ట్స్‌లో చూడండి
తన తాజా చిత్రం 'భారత్' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్... తన వ్యక్తిగత జీవితంలోని ఎన్నో సంగతులను అభిమానులతో పంచుకుంటున్నాడు. ఫిట్ నెట్, తన కుటుంబ జీవితం, కొత్త ప్రాజెక్టులు.. ఇలా అనేక విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు.

తాజాగా కొరియోగ్రాఫర్-యాక్టర్-డైరెక్టర్ ప్రభుదేవాతో కలసి సూపర్ హిట్ సాంగ్ 'ఊర్వశీ.. ఊర్వశీ.. టేకిట్ ఈజీ ఊర్వశీ'కి స్టెప్పులేశాడు. ఈ సందర్భంగా కన్నడ సూపర్ స్టార్ కిచ్చ సుదీప్, నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా కూడా వీరితో కలసి కాలు కదిపారు. వీరంతా ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో సల్మాన్ పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 'దబాంగ్ 3' చిత్రంలో కిచ్చ సుదీప్ కూడా నటిస్తున్నాడు.

Go Back to Shorts
Salman Khan
sudeep
prabhudeva
dance

More Telugu News