Guntur District: తాడేపల్లిలోని సీఎం నివాసం పరిసరాల్లో నిషేధాజ్ఞలు!

  • జగన్ నివాసాన్ని రేషన్ డీలర్లు ముట్టడిస్తారన్న సమాచారం
  • అప్రమత్తమైన పోలీసులు
  • పోలీసు చట్టం అమల్లో ఉందన్న అర్బన్ ఎస్పీ  
తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసాన్ని రేషన్ డీలర్లు నేడు ముట్టడిస్తారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో సీఎం నివాసం పరిసరాల్లో నిషేధాజ్ఞలు విధించారు. తాడేపల్లిలో పోలీసు చట్టం అమల్లో ఉందని, అక్కడ ఆందోళనలు నిర్వహించవద్దని అర్బన్ ఎస్పీ రామకృష్ణ చెప్పారు. పోలీసుల అనుమతి లేకుండా ఆందోళనలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే జగన్ నివాసం వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నిరంతర పరిశీలన, భద్రతా బలగాలతో పాటు డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.
Guntur District
Tadepalli
cm
jagan
residence

More Telugu News