Venkatesh: మనస్వినిపై హత్యాయత్నం ఘటన: ఆ రూమే కావాలంటూ పట్టుబట్టిన ప్రియుడు వెంకటేశ్

  • ఫ్లోర్ చివరన గది ఉండటమే కారణమంటున్న పోలీసులు
  • గదిలోకి వెళ్లే వరకూ బాగానే ఉన్న వెంకటేశ్
  • కేకలు విని తలుపులు బద్దలు కొట్టిన ఫ్లోర్ బాయ్
హైదరాబాదులో ఈ రోజు జరిగిన మనస్వినిపై వెంకటేశ్ హత్యాయత్నం కేసులో పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. పక్కా పథకం ప్రకారమే మనస్వినిపై వెంకటేశ్ దాడికి యత్నించినట్టు తెలిసింది. నేటి ఉదయం దిల్‌సుఖ్‌నగర్‌లోని బృందావన్ లాడ్జికి వెళ్లిన వెంకటేశ్ తనకు 501వ నంబర్ గది కావాలని అడిగాడు. కానీ లాడ్జి సిబ్బంది ఆ గదిని ఇచ్చేందుకు మొదట అంగీకరించలేదు. అయినా కూడా అతడు పట్టుబట్టి మరీ ఆ గదినే తీసుకున్నాడు.

అయితే లాడ్జిలో ఈ గది ఫ్లోర్‌లో చివరన ఉండటంతో అతడు ఏం చేసినా ఎవరికీ తెలిసే అవకాశం ఉండదనే వెంకటేశ్‌ దానిని ఎంచుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఉదయం 10 గంటలకు మనస్వినితో కలిసి లాడ్జికి వెళ్లిన వెంకటేశ్, గదిలోకి వెళ్లే వరకూ బాగానే ఉన్నాడు. ఆ తరువాత అతనిలో మార్పు ప్రారంభమైంది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం నేపథ్యంలో వెంకటేశ్ తన వద్ద ఉన్న చాకుతో మనస్విని గొంతు కోశాడు. గది నుంచి మనస్విని కేకలు విన్న ఫ్లోర్ బాయ్ వెంటనే ఆ గది తలుపులు బద్దలు కొట్టి చూసేసరికే మనస్విని రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే ఆసుపత్రి సిబ్బంది ఆమెను ఓమ్నీ ఆసుపత్రికి తరలించింది.
Venkatesh
Manaswini
Lodge
Omni Hospital
Floor Boy

More Telugu News