Adilabad: పురుగుల అన్నం, నాసిరకం కూరగాయలతో భోజనం వడ్డిస్తున్నారంటూ విద్యార్థుల ఆందోళన

షార్ట్స్‌లో చూడండి
తాము తినే భోజనంలో పురుగులు రావడాన్ని భరించలేని విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలికల పాఠశాలలో పురుగుల అన్నం, నాసిరకం కూరగాయలతో కూరలు వడ్డిస్తున్నారని విద్యార్థినులు ఆందోళన నిర్వహించారు. నేటి మధ్యాహ్నం వారు తినే అన్నంలో పురుగులు కనిపించడంతో, మధ్యాహ్న భోజన సిబ్బందిని నిలదీశారు. కానీ వారి నుంచి నిర్లక్ష్యపు సమాధానం రావడంతో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. వీరి ఆందోళన గురించి తెలుకున్న కలెక్టర్ దివ్య విద్యార్థినుల వద్దకు వచ్చి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంటనే విద్యాశాఖాధికారిని విచారణకు ఆదేశించారు.
Go Back to Shorts
Adilabad
Girls HIgh School
Mid day meal
Divya

More Telugu News