Sensex: ఒడిదుడుకుల మధ్య ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు

షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఊగిసలాట ధోరణిని ప్రదర్శించాయి. ప్రారంభం నుంచి ఒడిదుడుకుల మధ్య కొనసాగిన మార్కెట్లు చివరకు ఫ్లాట్ గా ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 10 పాయింట్లు లాభపడి 38,731కి పెరిగింది. నిఫ్టీ 2 పాయింట్ల నష్టంతో 11,555 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (5.52%), సన్ ఫార్మా (5.28%), హీరో మోటో కార్ప్ (3.14%), ఎల్ అండ్ టీ (2.44%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.20%).

టాప్ లూజర్స్:
టీసీఎస్ (-2.05%), యస్ బ్యాంక్ (-1.88%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.65%), ఐటీసీ (-1.53%), ఏషియన్ పెయింట్స్ (-1.44%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News