Hyderabad: ప్రియురాలి గొంతుకోసి ఆపై ప్రియుడి ఆత్మహత్యాయత్నం!

  • హైదరాబాద్ లోని చైతన్యపురిలో ఘటన
  • యువతి పరిస్థితి విషమం
  • యువకుడికి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స
హైదరాబాద్ లోని దిల్ షుక్ నగర్ లో దారుణం జరిగింది.  ప్రియుడు తన ప్రియురాలి గొంతును కోశాడు. ఈ దారుణ సంఘటన చైతన్యపురిలోని బృందావనం లాడ్జిలో జరిగింది. ప్రియురాలి గొంతు కోసిన అనంతరం, ప్రియుడు తన గొంతు కూడా కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఈ ప్రేమ జంటకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. యువకుడు వెంకటేశ్ ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంకటేశ్ నెల్లూరు జిల్లాకు, యువతి నగరంలోని బడంగ్ పేటకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు.
Hyderabad
Dilsukhnagar
chaitanyapuri

More Telugu News