Andhra Pradesh: సంక్షేమ పథకాలన్నీ ఎత్తివేస్తూపోతే.. ప్రజలు మిమ్మల్ని ఎత్తేస్తారు జగన్ గారు!: నారా లోకేశ్ చురకలు

  • వైసీపీ హయాంలో సంక్షేమం కుంటుపడింది
  • చంద్రన్న బీమా, పసుపు కుంకుమ పథకాలను ఆపేశారు
  • ఏపీ సీఎం జగన్ పై మండిపడ్డ టీడీపీ నేత
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చాక సంక్షేమం అన్నది కుంటుపడిందని టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. చంద్రన్న బీమా, ముఖ్యమంత్రి యువనేస్తం, పసుపు-కుంకుమ, రంజాన్ తోఫా, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సహా పలు పథకాల అమలును ఆపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా సంక్షేమ పథకాలను సీఎం జగన్ ఎత్తేస్తే ప్రజలు ఆయన్ను ఎత్తివేస్తారని చురకలు అంటించారు. ప్రభుత్వం అన్నది ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని హితవు పలికారు.

‘అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించడం అటుంచి, అధికారం దక్కిందనే గర్వంతో టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై వైసీపీ నేతలు దాడులు చేశారు. అయినా మేము సంయమనం పాటించాం. మా కార్యకర్తల సహనాన్ని చేతకానితనం అనుకోవద్దు, మా కార్యకర్తలు తెగించి తిరగబడితే అడ్డుకోవడం మీ తరంకాదు. ఇకనైనా దాడులు ఆపండి’ అని నారా లోకేశ్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.
Andhra Pradesh
Telugudesam
Nara Lokesh
Twitter
Jagan
Wellfare schemess
warning

More Telugu News