Hrithik Roshan: ముస్లిం వ్యక్తితో తన సోదరి సంబంధంపై హృతిక్ రోషన్ స్పందన

  • ఇది మా కుటుంబానికి సంబంధించిన అంశం
  • సునైనా మానసిక రుగ్మతతో బాధపడుతోంది
  • సరైన వైద్య వసతులు మన దేశంలో లేవు
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సోదరి సునైనా ప్రేమ వ్యవహారం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రుహైల్ అమీన్ అనే వ్యక్తిని ఆమె ప్రేమిస్తోంది. అయితే రుహైల్ ముస్లిం అనే కారణంగా తనను అతనికి దూరంగా ఉంచారంటూ సొంత కుటుంబసభ్యులపై ఆమె ఆరోపణలు గుప్పించింది. తన సోదరి వ్యాఖ్యలపై హృతిక్ స్పందించాడు.

'ఇది నా కుటుంబానికి మాత్రమే పరిమితమైన ఒక సున్నిత అంశం. ప్రస్తుత పరిస్థితుల్లో సునైనా గురించి మాట్లాడటం సరికాదు. మాలాగే ఎన్నో కుటుంబాలు ఇలాంటి బాధలనే అనుభవిస్తుండటం దురదృష్టకరం. సునైనా మానసిక రుగ్మతతో బాధ పడుతోంది. అలాంటి కేసులకు సరైన వైద్య వసతులు మన దేశంలో లేవు' అంటూ హిందుస్థాన్ టైమ్స్ తో మాట్లాడుతూ హృతిక్ ఈ మేరకు స్పందించాడు.
Hrithik Roshan
Sister
Relationship
Bollywood

More Telugu News