S.P. Charan: నాన్న ముందు పాడటానికి టెన్షన్ పడతాను: ఎస్.పి. చరణ్

  • బాలూగారి కొడుకుగా పుట్టడం అదృష్టం 
  • స్టేజ్ పై నాన్న పాడుతుంటే చూడటం ఇష్టం
  • అందుకే నాన్న ముందు పాడాలంటే భయమన్న చరణ్     
మధురగాయకుడు బాలసుబ్రహ్మణ్యం గురించి తెలియని వాళ్లంటూ వుండరు. చాలా కాలంగా మధురమైన స్వరంతో ఆయన శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తూ వస్తున్నారు. బాలు మంచి గాయకుడు మాత్రమే కాదు .. అభిరుచి గల నిర్మాత .. పాత్రలో ఒదిగిపోయే నటుడు కూడా. బాలు తనయుడు చరణ్ కూడా ఆయన దారిలోనే నడుస్తూ వస్తున్నాడు. గాయకుడిగా తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లో ఆయన పాటలు పాడుతున్నాడు. అలాగే నటుడిగాను .. నిర్మాతగాను ఆయనకి అనుభవం వుంది.

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఎస్.పి.చరణ్ మాట్లాడుతూ .. "బాలసుబ్రహ్మణ్యం తనయుడిగా పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఆయనలా పాటల ప్రయాణాన్ని కొనసాగిస్తున్నందుకు సంతోషపడుతున్నాను. నాన్న స్టేజ్ పై పాడుతుంటే ముందు వరుసలో కూర్చుని చూస్తాను. అదే నేను స్టేజ్ పై వుండి .. నాన్న ముందు వరుసలో కూర్చుంటే ఆయన ఎదురుగా పాడటానికి టెన్షన్ పడతాను. ఎందుకంటే అక్షరాలను ఏ మాత్రం తేడాగా పలికినా ఆయన పట్టేస్తారు" అని చెప్పుకొచ్చాడు. 
S.P. Charan
Ali

More Telugu News