Nellore District: నెల్లూరులో వ్యభిచార గృహాలపై దాడులు.. 9 మంది మహిళలకు విముక్తి

  • వేదాయపాళెంలో వ్యభిచార గృహాలు
  • ఆదివారం సాయంత్రం దాడులు
  • గృహాల నిర్వాహకులు, విటులు అరెస్ట్
నెల్లూరులోని వేదాయపాళెంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచారగృహాలపై దాడులు చేసిన పోలీసులు తొమ్మిదిమంది మహిళలకు విమక్తి కలిగించారు. వ్యభిచార గృహ నిర్వాహకులు చంద్రమ్మ, కామాక్షి, లావణ్యలను అదుపులోకి తీసుకున్నారు. వేదాయపాళెంలో గత కొంతకాలంగా జోరుగా వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం మేరకు నిఘా పెట్టామని ఇన్‌చార్జ్ డీఎస్పీ మరియదాసు తెలిపారు. ఆదివారం సాయంత్రం పక్కా సమాచారంతో వృభిచార గృహాలపై దాడిచేసినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గృహ నిర్వాహకులతోపాటు ఆరుగురు విటులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.  
Nellore District
vedayapalem
S*x workers
Andhra Pradesh

More Telugu News