Telangana: అమిత్ షా ఎక్కడ అడుగుపెడితే అక్కడ రక్తపాతమే: టీ-జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్

  • రజాకార్లకు పట్టిన గతే బీజేపీకి పడుతుంది
  • ఆధునిక నిజాం కేసీఆర్ కాదు
  • ఆధునిక రజాకార్ అమిత్ షా
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలపై తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రకాశ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై ఆయన నిప్పులు చెరిగారు. ఆధునిక నిజాం కేసీఆర్ కాదని, ఆధునిక రజాకార్ మాత్రం అమిత్ షా అని వ్యాఖ్యానించారు. అమిత్ షా ఎక్కడ అడుగుపెడితే అక్కడ రక్తపాతమేనని, రాష్ట్రంలోకి బీజేపీ అడ్డదారుల్లో ప్రవేశించాలని చూస్తే రజాకార్లకు పట్టిన గతే పడుతుందని ధ్వజమెత్తారు.
Telangana
TRS
bjp
amitshah
cm
kcr

More Telugu News