Congress: ముంబయి నుంచి గోవా మకాం మార్చిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు!

  • రెండ్రోజుల క్రితం రాజీనామా చేసిన 13 మంది ఎమ్మెల్యేలు
  • ముంబయిలో మకాం
  • సోఫిటెల్ హోటల్ ఎదుట కాంగ్రెస్ వినూత్న నిరసన
కర్ణాటక రాజకీయ సంక్షోభంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజీనామా చేసిన 13 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు ముంబయి నుంచి గోవాకు మకాం మార్చారు. వీరంతా రెండ్రోజుల కిందట రాజీనామా చేసి ముంబయి వెళ్లడం తెలిసిందే. అయితే, ముంబయిలో వీరు బసచేసిన సోఫిటెల్ హోటల్ ముందు కాంగ్రెస్ కార్యకర్తలు గుర్రాలు, సూట్ కేసులతో విభిన్నతరహాలో ప్రదర్శన నిర్వహించారు. దానికితోడు, కర్ణాటక కాంగ్రెస్ మంత్రి డీకే శివకుమార్ అసంతృప్త నేతలతో చర్చించేందుకు ముంబయి బయల్దేరారు. ఈ నేపథ్యంలో, ఇంకా ముంబయిలోనే ఉంటే తమకు ఇబ్బంది తప్పదని భావించిన కాంగ్రెస్, జేడీఎస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు గోవా పయనం అయినట్టు సమాచారం.
Congress
JDS
Karnataka
Mumbai

More Telugu News