Maharastra: ముంబైకు మారిన కర్ణాటక రాజకీయం.. సోఫిటెల్ హోటల్ ఎదుట కాంగ్రెస్ ఆందోళన

  • సోఫిటెల్ హోటల్‌లో బస చేసిన ఎమ్మెల్యేలు
  • బీజేపీ ప్రమేయం ఉందని భావిస్తున్న కాంగ్రెస్
  • గుర్రాలను ఎక్కి, సూట్‌కేసులతో ఆందోళన
కర్ణాటక రాజకీయం ముంబైకు మారింది. కర్ణాటకలో నేడు అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేసిన దాదాపు 13 మంది ఎమ్మెల్యేలు ముంబైలోని సోఫిటెల్ హోటల్‌లో బస చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు నేడు హోటల్ బయట వినూత్నంగా ఆందోళన నిర్వహించారు.

మహారాష్ట్రలో కాంగ్రెస్ అసమ్మతి నేతలు బస చేయడం వెనుక బీజేపీ ప్రమేయం ఉందని భావిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు గుర్రాలను ఎక్కి, సూట్‌కేసులు, బ్యానర్లు, మాస్క్‌లతో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ఆందోళన నిర్వహించారు. బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుతో ప్రజాస్వామ్యం గొంతు నులుముతోందంటూ బీజేపీపై మండిపడ్డారు. దీంతో పోలీసులు సోఫిటెల్ హోటల్ వద్దకు వచ్చి ఆందోళనకారులను వ్యాన్లలో తరలించి హోటల్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.  
Maharastra
Mumbai
Sofitel Hotel
Congress
Horse
Suite case
BJP

More Telugu News