Andhra Pradesh: నాపై కేసులు సరే, చిత్తశుద్ధితో విచారణ చేయించండి: టీడీపీ నేత కోడెల డిమాండ్

  • మా కుటుంబసభ్యులపై పుంఖాను పుంఖాలుగా కేసులు
  • ఆ కేసులు ఎందుకు పెడుతున్నారో!
  • వాస్తవాలేంటో తెలియవు
ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణాలు నిలిపివేయడంతో వేలాది మంది కూలీలకు పని లేక ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ విమర్శించారు. గుంటూరులో టీడీపీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తనపైనా, తన కుటుంబసభ్యులపైనా పుంఖాను పుంఖాలుగా కేసులు పెడుతున్నారని, ఆ కేసులు ఎందుకు పెడుతున్నారో, వాస్తవాలేంటో తెలియవని అన్నారు. కేసులు పెడుతున్నారు సరే, విచారణ చేయించండి అని డిమాండ్ చేశారు. ప్రైమాఫేసీ లేకుండా కేసులు రిజిస్టర్ చేయరని అన్నారు. అలా కాకుండా, తనపై ఆరోపణలు చేస్తుంటే కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై నమోదు చేసిన కేసులపై చిత్తశుద్ధితో విచారణ జరిపించాలని, తన తప్పు ఉన్నా, ఈ కేసులు నిరూపితమైనా తనకు శిక్షలు వేయాలని వ్యాఖ్యానించారు.
Andhra Pradesh
Telugudesam
kodela
YSRCP
jagan

More Telugu News