Kumaraswamy: కర్ణాటక సంక్షోభంపై సీఎం కుమారస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు

షార్ట్స్‌లో చూడండి
కర్ణాటక రాజకీయ సంక్షోభంపై ముఖ్యమంత్రి కుమారస్వామి ఆసక్తికరంగా స్పందించారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల దెబ్బకు సర్కారు పరిస్థితి డోలాయమానంలో పడిన నేపథ్యంలో, సమస్య పరిష్కారమైందంటూ వ్యాఖ్యానించారు. ఇకపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, పరిస్థితి చక్కబడిందని అన్నారు. జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

కాగా, కూటమికి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు ఒక్కసారిగా రాజీనామా చేయడంతో కర్ణాటక సర్కారు సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే. రాజీనామా చేసిన అసంతృప్తులు ముంబయి వెళ్లి ఓ హోటల్ లో మకాం వేసి కర్ణాటక రాజకీయాలను శాసించే స్థితికి చేరారు. చివరికి కాంగ్రెస్ మంత్రులు తమ పదవులను అసంతృప్తులకు త్యాగం చేసేందుకు కూడా వెనుకాడలేదు. ఈ నేపథ్యంలో, సమస్య పరిష్కారమైందంటూ కుమారస్వామి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Go Back to Shorts
Kumaraswamy
Karnataka
Congress
JDS

More Telugu News