Amit Shah: అది బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా నైజం: టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ ధ్వజం

  • గొడవలు పెట్టి పబ్బం గడుపుకొంటారు
  • అది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య
  • కేంద్ర హోంమంత్రి వీధి పోరాటాలు చేస్తామనడం హాస్యాస్పదం
తెలంగాణలో గొడవలు సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ధిపొందడం బీజేపీ చీఫ్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నైజమని, అది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌కుమార్‌ ధ్వజమెత్తారు. బాధ్యతాయుతమైన పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి వీధి పోరాటాలు చేస్తామనడం చూస్తుంటే ఆయన గుణం అర్థం కావడం లేదా? అని అన్నారు.

 తెలంగాణలో అలజడి సృష్టిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వీధి పోరాటాలు కాకుండా సైద్ధాంతిక పోరాటాలకు తాము సిద్ధమని, అందుకు షా సిద్ధం కావాలని సవాల్‌ విసిరారు. ఎన్నిరోజులకు ఒక కేంద్రమంత్రిని రాష్ట్రానికి పంపినా తమకు అభ్యంతరం లేదని, కానీ నిధులిచ్చి పంపాలని కోరారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కాళేశ్వరానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
Amit Shah
vinodh
TRS
BJP

More Telugu News