Andhra Pradesh: అమెరికాలో ‘లోకేశ్ గ్యాంగ్’ రామ్ మాధవ్ ను అవమానించింది.. తమ నీచబుద్ధిని బయటపెట్టుకుంది!: కన్నా

  • అవి తానా సభలు కావు.. టీడీపీ భజన సభలు
  • పచ్చతమ్ముళ్లు అమెరికాలోనూ తెలుగువారి ప్రతిష్ఠను దిగజార్చుతున్నారు
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన ఏపీ బీజేపీ చీఫ్
అమెరికాలో జరుగుతున్న ‘తానా’ సభల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ ప్రసంగాన్ని సభికులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఈ గొడవపై తీవ్రంగా మండిపడ్డారు. అమెరికాలో ప్రస్తుతం జరుగుతున్నవి ‘తానా’ సభలు కావనీ, అవి ‘టీడీపీ భజన సభలు’ అని విమర్శించారు. పచ్చతముళ్లు అమెరికాలో కూడా తెలుగువారి ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని దుయ్యబట్టారు.

రాంమాధవ్ గారిని సభలకు ఆహ్వానించి, ఆయన జాతీయవాద ప్రసంగానికి అడ్డు తగలడం ద్వారా లోకేశ్ గ్యాంగ్ ఆయన్ను అవమానించిందనీ, తమ నీచబుద్ధిని బయటపెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో టీడీపీ  చేసిన బురద రాజకీయాల నుంచే కమలవికాసం జరుగుతుందని జోస్యం చెప్పారు. ఈ మేరకు కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు.
Andhra Pradesh
USA
TANA
ram madhav
kanna
BJP
Telugudesam
lokesh gang

More Telugu News